కూలీన గూళ్లు…!

క్రైం తాండూరు వికారాబాద్

కూలీన గూళ్లు…!
– పెద‌ల‌కు క‌ష్టం తెచ్చిన వ‌ర్షం
– అంతారం తాండ‌, పెద్దేముల్ మండ‌లాల్లో భీభ‌త్సం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: గ‌త రెండు, మూడు రోజులుగా ఎడ‌తెర‌పిలేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో పేద‌ల ఇండ్లు కూలీపోతున్నాయి. వ‌ర్షాల కార‌ణంగా నిరుపేద‌ల క‌ష్టాల క‌డ‌లికి ద‌గ్గ‌ర‌వుతున్నారు. వ‌ర్ష భీభ‌త్సానికి క‌లిగిన న‌ష్టంకు ప‌రిహారం అందించి ఆదుకోవాల‌ని మొర‌పెట్టుకున్నారు. తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలోని తాండూరు, పెద్దేముల్ మండ‌లాల్లో వ‌ర్షం భీభ‌త్సాన్ని సృష్టించింది.
తాండూరు మండ‌లం అంతారం భూకైలాస్ తాండాలో కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా ఇండ్లు కూలిపోయింది. కూలీ ప‌నులు చేసుకుంటూ జీవ‌నం సాగించే దేవ‌మ్మ ఇళ్లు కూలిపోయింది. శ‌నివారం అర్ద‌రాత్రి దాటిన త‌రువాత ఆదివారం తెల్ల‌వారు జాము ప్రాంతంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. అదృష్ట వ‌శాత్తు ఇంటి వెనుక భాగం కూలీ పోవ‌డంతో ఇంట్లో నిద్రిస్తున్నవారికి ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు.
మ‌రోవైపు పెద్దేముల్ మండ‌లం గాజీపూర్‌లో ఆంజ‌నేయ స్వామి దేవాల‌య గోడ కూడ కూలిపోయింది. అదే మండ‌లంలోని మ‌ద‌నంత‌పూర్‌లో ఓ మ‌హిళ ఇళ్లు, గిర్మాపూర్ గ్రామంలో మ‌ల్ల‌ప్ప అనే వ్య‌క్తి ఇండ్లు కూడ ఇంటి వెనుక భాగంలో కూలి పాక్షికంగా ధ్వంస‌మ‌య్యాయి. వ‌ర్షానికి క‌లిగిన ప్ర‌మాదంతో తీవ్ర న‌ష్టం కలిగింద‌ని, ప్ర‌భుత్వ‌మే ప‌రిహారం అందించి ఆదుకోవాల‌ని బాధిత య‌జ‌మానులు కోరుతున్నారు.