ఆరుబైటికి రావొద్దు.. ఆగం కావొద్దు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆరుబైటికి రావొద్దు.. ఆగం కావొద్దు..!
– అంద‌రు సుర‌క్షితంగా ఉండండి
– మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : అమ్మా.. ఇంకా రెండు రోజులు భారీ వ‌ర్షాలు కురుస్తాయంటా.. అందుకే ఎవ్వ‌రు ఇంట్లో నుంచి ఆరు బ‌య‌కు రాకుండా.. ఆగం కాకుండా సుర‌క్షితంగా ఉండాల‌ని అంటూ టీఆర్ఎస్ మండ‌ల పార్టీ మైనార్టీ సెల్ అధ్య‌క్షులు, మాజీ ఉప‌స‌ర్పంచ్ షేక్ హ‌స‌న్ ప‌టేల్ ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. సోమవారం తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సూచనల మేరకు మండలంలోని మల్కాపూర్ గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని భవానీ కాలనీలో ఇంటింటికి వెళ్లి జాగ్రత్తలు సూచించారు. వ‌ర్షాలు ఇంకా కురుసే అవ‌కాశం ఉన్నందున‌ నేపథ్యంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని, పాడుబ‌డిన ఇండ్ల‌లో ఉండ‌రాద‌ని, సుర‌క్షింతంగా ఉండాల‌ని అప్ర‌మ‌త్తం చేశారు. చెరువులు, కుంట వ‌ద్ద‌కు వెళ్లొద్ద‌ని, విద్యుత్ పరికరాలు, ఇనుప వస్తువులు తాకరాద‌ని చెప్పారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు.