తీన్మార్ మల్లన్నను విడుదల చేయాలి

క్రైం తాండూరు రంగారెడ్డి వికారాబాద్

తీన్మార్ మల్లన్నను విడుదల చేయాలి
– యాలాల మండ‌లంలో అఖిల‌ప‌క్షం నాయకుల నిర‌స‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌శ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను విడుదల చేయాలని అఖిల‌ప‌క్షం నాయ‌కులు డిమాండ్ చేశారు. ఆదివారం యాలాల మండల కేంద్రం లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు యాలాల మండల అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ… తీన్మార్ మల్లన్న ను విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్టం లో తెరాస కెసిఆర్ ప్రభుత్వం ప్రశ్నించే సామాజిక రాజకీయ నాయకులకు బెదిరింపులు చేస్తూ అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారని విమ‌ర్శించారు. ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు చేస్తూ నాయకులను బెదిరింపులు చేయడంలో ప్రభుత్వం ముందు వరుసలో ఉందని అన్నారు. దళిత కుటుంబాలకి దళిత బంధు అని హుజురాబాద్ లో ఉప ఎన్నికలు ఉన్నందున దళితులకి ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తాము అని దళితులని అన్నివిధాలా ఆదుకుంటాం అని గొప్పలు చెప్పుతున్న ప్రభుత్వం, ఒక పక్క దళిత ఉద్యోగులకి ప్రమోషన్ లలో కోత విధుస్తూ దళితుల్ని మోసం చేస్తున్నాయ‌ని అన్నారు. మాయ మాటలు చెప్పడం లో కెసిఆర్ తెలంగాణ రాష్టం లో మొదటి స్థానం సాధించారు అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో అక్రమ అరెస్ట్ లు ఆపాలని, అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన, కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అయ్యగాళ్ల భీమప్ప, మాజీ మండల పార్టీ అధ్యక్షులు వీరేశం, సీపీఎం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి యు బుగ్గప్ప, సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు ఉప్పలి మల్కయ్య, బీజేపీ యాలాల మండల అధ్యక్షులు కుర్వ మహిపాల్ యాదవ్, నాయకులు అమృతప్ప, మొగుళప్ప, ముస్తఫా, బలరాం, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.