అంత్యక్రియలకు ఆర్ధిక సహాయం
– రూ. 2వేలు అందించిన సర్పంచ్ విజయలక్ష్మీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: పేదింట్లో జరిగిన చావు అంత్యక్రియలకు తాండూరు మండలం మల్కాపూర్ గ్రామ సర్పంచ్ విజయలక్ష్మీ పండరి సహాయం అందజేశారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కటై బాలప్ప తల్లి లక్ష్మమ్మ కన్నుమూసింది. శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ విజయలక్ష్మీ పండరి ఆధ్వర్యంలో కుటుంబానికి రూ. 2వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సాయాన్ని గ్రామ నాయకులు కుటుంబానికి అందజేశారు.



