టీయూడబ్ల్యూజే ఐజేయూ బలోపేతం అందరి బాధ్యత
– జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలి
– యూనియన్ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో న్యాయంగా పోరాడే టీయూడబ్ల్యూజే ఐజేయూ యూనియన్‌ను బలపేతం చేయడం అందరి బాధ్యత అని యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వేణుగోపాల్ రెడ్డిలు అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో తాండూరు డివిజన్ అధ్యక్షులు నర్సింలు, ప్రధాన కార్యదర్శి పటేల్ నరేందర్(లిట్టు)ల ఆధ్వర్యంలో
యూనియన్ సర్వసభ్య, సభ్యత్వ నమోదు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ చారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వేణుగోపాల్ రెడ్డిల సమక్షంలో
తాండూరు డివిజన్, తాండూరు టౌన్, తాండూరు మండలం, పెద్దేముల్ మండలం, బషీరాబాద్ మండలాల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులకు యూనియన్ తరుపున పొడగించిన
సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీయూడబ్ల్యూజే ఐజేయూ యూనియన్ జర్నలిస్టుల సమస్యలపై నిక్కచ్చిగా పోరాటం చేస్తుందని అన్నారు. యూనియన్‌ను బలోపేతం చేయడంలో అందరి బాధ్యత
ఉందన్నారు. యూనియన్లతో సంబంధం లేకుండా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులను అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్
సభ్యులు వాసు(వెంకటేశం), నర్సంహారెడ్డి, రాంచెందర్, జిల్లా కోశాధికారి రఘు, కార్యవర్గ సభ్యులు గోపాల్, సీనియర్ పాత్రికేయులు కరణం భీంసేన్ రావు, తాండూరు డివిజన్ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి
రామకృష్ణ(ఆర్కే), తాండూరు పట్టణ అధ్యక్షులు మఠం నిరంజన్ స్వామి, ప్రధాన కార్యదర్శి మహేష్, తాండూరు మండల అధ్యక్షులు వడ్ల సంగమేష్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, పెద్దేముల్ మండల అధ్యక్షులు పాండు, ప్రధాన
కార్యదర్శి గయాజ్, బషీరాబాద్ మండల అధ్యక్షులు శివ కుమార్, ప్రధాన కార్యదర్శి సైమండ్స్, జర్నలిస్టులు శాంతు, వెంకట్రాంరెడ్డి, రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాంచెందర్, కోస్గం నర్సింలు, డి.శ్రీనివాస్, వంశి, దీపక్ ఠాకూర్, వెంకట్, శ్రీధర్, రమేష్, ఖాజ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
