ఉత్తమ సేవలకు అవార్డు
– తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి గౌరవం
– కాయకల్పలో రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు
– ఆసుపత్రికి రూ. 25 లక్షల ప్రోత్సహాం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అందిస్తున్న ఉత్తమ సేవలకు అవార్డు దక్కింది. జిల్లా, ఏరియా దవాఖానలతో పాటు పీహెచ్‌సీలకు కేంద్ర ప్రభుత్వం కాయకల్ప అవార్డులు ప్రకటించగా జిల్లా ఆసుపత్రి సంపూర్ణ అర్హత సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. దవాఖాన పారిశుధ్య నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డు-2022కు గాను అవార్డుతో పాటు రూ.25 లక్షల ప్రోత్సాహాన్ని అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్న ఈ అవార్డు కోసం జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా.రవిశంకర్, వైద్య బృందం తీవ్రంగా శ్రమించింది. కాయకల్ప అధికారుల బృందం ఈ యేడాది జనవరి, మార్చి- ఏప్రిల్ మాసాలలో ఆసుపత్రిని సందర్శించి కేంద్రానికి నివేధిక సమర్పించారు. ఈ నివేధికలో జిల్లా ఆసుపత్రికి 92 శాతం మార్కులను సాధించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోనే జిల్లా ఆసుపత్రి ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందుకు గాను కేంద్రం ఆసుపత్రికి రూ. 25 లక్షల ప్రోత్సహాన్ని అందించనుంది. దీ నిధులతో 25 శాతం నర్సింగ్ స్టాఫ్, 20 శాతం వైద్యులకు సౌకర్యాలు, 15 శాతం పారమెడికల్ సిబ్బంది, ల్యాబరోటరి యూనిట్స్, రేడియోలాజీ, డ్రైస్సింగ్ రూరం, ఆపరేషన్ థియేటర్ కోసం వినియోగం, 5 శాతం కార్యనిర్వహాణ విభాగాల కోసం వినియోగించాల్సి ఉంటుంది.
అభినందించిన జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డి
ఆసుపత్రి కాయకల్ప అవార్డుకు ఎంపిక కావడంపై వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునితారెడ్డి ఆసుపత్రి వైద్య బృందాన్ని అభినందించారు. అందరి సమన్వంతో అవార్డు దక్కిందన్నారు. రెట్టింపు ఉత్సాహంతో పని చేసేందుకు ఈ అవార్డులు ప్రేరణగా నిలుస్తాయి. వైద్యులు, సిబ్బంది పనితీరు నిబద్దతకు ఈ అవార్డుతో తగిన గుర్తింపు వచ్చిందన్నారు.



