పోలీసులతో వాగ్వివాదం
– నలుగురిపై కేసు, రిమాండుకు తరలింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి: పోలీసులతో వాగ్వివాదానికి పాల్పడిన నలుగురుపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 16న పాత తాండూరులోని దర్గాలో ఉర్సు ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో ఆరోజు తెల్లవారు జాము 3గంటల ప్రాంతంలో జరిగిన ఊరేగింపులో పాత తాండూరుకు చెందిన మహమ్మద్ అబ్రార్ హుస్సేన్, ఎండి మతీన్, షోయబ్, ఆరోన్లో బ్యాండు కొట్టరాదు, ఊరేగింపు చేయరాదని అడ్డుకున్నారు. అక్కడే బందోబస్తులో ఉన్న ఎస్ఐ మహిపాల్ రెడ్డి, కానిస్టేబుల్ వెంకట్రామ్లు, ఇక్బాలు వారిని వారించారు. ఇందుకు వారు పోలీసులతో దురుసుగా.. వ్యవహరిస్తూ విధులకు ఆటంకం కలిగించారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.



