సునీతమ్మ వెంటే ఉంటాం..!
– సంఘీభావం తెలిపిన తాండూరు నేతలు
– ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్ పర్సన్లతో భేటి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డికి అన్ని సమయాల్లో వెంటే ఉంటామని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కౌన్సిలర్లు, నేతలు భరోసా అందించారు. సోమవారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో పాటు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతారెడ్డితో నేతలు, మున్సిపల్ కౌన్సిలర్లు భేటీ అయ్యారు.
మర్పల్లి సంఘటనను ఖండిస్తూ పూర్తి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, సునీతారెడ్డిల నాయకత్వంలోనే సాగుతామని అన్నారు. ఎలాంటి సమయంలో అయినా అండగా ఉంటామని భరోసా అందించారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డిలను కలిసిన వారిలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, సల్మా పాతిమా, రాము, కోఆప్షన్ సభ్యులు బిడ్కర్ ఉశ, అబ్దుల్ ఖవి, మహిళ నాయకురాలు నర్మదా రెడ్డి, టీఆర్ఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, బంటు మల్లప్ప, మసూద్, బోయరాజు, జావిద్, బీదర్ రాజశేఖర్, బిర్కడ్ రఘు, రొంపల్లి సంతోష్ కుమార్, దత్తు, అశోక్, అంబ్రేష్ తదితరులు ఉన్నారు.



