మృతుల కుటుంబాల‌కు ఎమ్మెల్సీ ప‌రామ‌ర్శ‌

తాండూరు రాజకీయం వికారాబాద్

మృతుల కుటుంబాల‌కు ఎమ్మెల్సీ ప‌రామ‌ర్శ‌
– సానుభూతిని ప్ర‌క‌టించిన మ‌హేంద‌ర్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లువురి మృతుల కుటుంబాల‌ను ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. గురువారం యలాల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొండా నాగరావు క‌న్నుమూశారు. అదేవిధంగా పెద్దేముల్ మండ‌లం రుక్మాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ నాయ‌కులు వీరేశం మ‌ర‌ణించారు. ఈ విష‌యం తెలుసుకున్న ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి యాలాల గ్రామంలో కొండా నాగారావు కుటుంబ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి నివాళులు అర్పించారు.

అనంత‌రం రుక్మాపూర్‌లో వీరేశం కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి సానుభూతిని ప్ర‌క‌టించారు. ఎమ్మెల్సీ వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తము రావు, యాలాల సర్పంచ్ సిద్రాల సులోచన‌, యాలాల పీఏసీఎస్ మాజీ చైర్మ‌న్ సిద్రాల శ్రీ‌నివాస్, నాగారం పాండు గౌడ్, కమ్మ‌రి శేఖ‌ర్, కొస్గి వెంకటయ్య, ఉప్పరి యదప్ప, భాస్కర్ చారీ, బాలరాజు,బల్ రెడ్డి, మంగలి శ్రీధర్,శంకరం లాలప్ప, దుర్కి నర్సింహులు, పండాలి ప్రభాకర్, కొత్త శ్రీనివాస్, రాపోలు రాములు, పెద్దేముల్‌లో సర్పంచుల సంఘం అధ్యక్షుడు మారేపల్లి బల్వంత్ రెడ్డి, మంబాపుర్ ప్రకాష్, ఎంపిటిసి శ్రీను, మల్లేశం, వెంకటప్ప, సత్యనారాయణ, శ్రీను, వడ్ల ప్రభు తదితరులు ఉన్నారు.