స‌ల్లంగా సూడు నాగ ఎల్లమ్మ

తాండూరు రాజకీయం వికారాబాద్

స‌ల్లంగా సూడు నాగ ఎల్లమ్మ
– వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: భ‌క్తుల‌తో పాటు ప్ర‌జ‌లంద‌రిని స‌ల్లంగా చూడాల‌ని తాండూరు మున్సిప‌ల్ వైస్ చైర్ పర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు ప‌ట్ట‌ణంలోని నెహ్రుగంజ్‌లో వెల‌సిన శ్రీ రేణుకా నాగ ఎల్ల‌మ్మ‌ను వేడుకున్నారు. శుక్ర‌వారం ఆషాఢ మాసం సంద‌ర్భంగా ఆయ‌లంలో వెల‌సిన అమ్మ‌వారిని శాకాంబ‌రి మాత‌గా ప్ర‌త్యేక అలంక‌ర‌ణ చేశారు. ఈ సంద‌ర్భంగా వైస్ చైర్ పర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు ఆల‌యానికి చేరుకుని అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సందర్భంగా వైస్-చైర్ పర్సన్ దీపా నర్సింలు గారు మాట్లాడుతూ.. నాగఎల్లమ్మ స‌ల్ల‌ని చూపుతో అంద‌రు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. అమ్మవారి అనుగ్రహంతో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతన్నలకు పసిడిగా పండిన దాన్యంతో ఈ గంజ్ ఆవరణ మొత్తం కలకళాలడలని దేవి అనుగ్రహం తప్పక ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, సంగీతా ఠాకూర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.