మైనార్టీ రెసిడెన్షియ‌ల్ స్కూల్‌, కాలేజీ భేష్‌

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

మైనార్టీ రెసిడెన్షియ‌ల్ స్కూల్‌, కాలేజీ భేష్‌
– రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీని సందర్శించిన నేతలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు ప‌ట్ట‌ణం హైద‌రాబాద్ రోడ్డు మార్గంలో నూత‌రంగా ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ బాలిక‌ల రెసిడెన్షియ‌ల్ స్కూల్ క‌మ్ కాలేజీ భేష్‌గా ఉంద‌ని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం) అన్నారు. శనివారం స్కూల్, కాలేజీని టీఆర్ఎ 5 పట్టణ అధ్యక్షులు అప్పూతో పాటు తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సందర్శించారు. స్కూళ్లో విద్యతో పాటుతో పాటు విద్యార్థులకు అందించే భొ జనం, కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అప్పూ, పలువురు మాట్లాడుతూ తెలంగాణలో మైనార్టీ విద్యార్థుల విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలను ఏర్పాటు చేసి కార్పోరేట్ స్థాయి విద్యను అందిస్తోందన్నారు. తాండూరులో కోట్లాది రూపాయిలు వెచ్చించి స్కూల్ క‌మ్ కాలేజీని ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల మంత్రి హ‌రీష్ రావు, స‌బితారెడ్డి, కొప్పుల ఈశ్వ‌ర్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బాబర్, ఉపాధ్యక్షులు అలీం(షల్లో), కార్యదర్శి ఉస్మాన్ గని, సభ్యులు పాషా ఖురేషీ, అబ్దుల్ సలీం, అన్వర్ ఖాన్, అబ్దుల్ లతీఫ్, ముక్రమ్ తదితరులు ఉన్నారు.