నగరేశ్వరాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పూజలు
– మహా హారతిని దర్శించుకున్న ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని శ్రీ నగరేశ్వర దేవాలయంలో ప్రతి వారం మహా హారతిని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నిర్వహించిన మహా హారతిలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్పంచుకున్నారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా సర్సింలు, నేతలతో కలిసి నగరేశ్వరాలయంలో స్వామి వారిని, వాసవి కన్యకా పరమేశ్వరి మాతను దర్శించుకుని పూజలు నిర్వహించారు.

అనంతరం నిర్వహించిన మహా హారతిలో హారతిని దర్శించుకున్నారు. పట్టణం, నియోజక వర్గ ప్రజలందరు సంతోషంగా జీవించాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాజుగౌడ్, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, ఆలయ కమిటీ చైర్మన్లు కుంచెం మురళిధర్, బంటారం సుధాకర్, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మార్కెట్ కవి టీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, డైరెక్టర్ కట్కం వీరేందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, యువ నాయకులు నరేందర్ గౌడ్, ఆర్యవైశ్య, వాసవి మహిళ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



