మాకు మండ‌లం కావాలి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మాకు మండ‌లం కావాలి..!
– త‌ట్టెప‌ల్లికి కొత్త హోదా ప్ర‌క‌టించాలి
– లేదంటే ఆందోళ‌న ఉధృత‌మే
పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ రాష్ట్రంలో మాకు కొత్త మండ‌లం కావాల‌ని వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండ‌లంలోని త‌ట్టెప‌ల్లి వాసులు డిమాండ్ చేశారు. బుధ‌వారం ఉద‌యం రోడ్లుపైకి వ‌చ్చి ఆందోళ‌న చేప‌ట్టారు. జ‌నాలు పెద్ద ఎత్తున రావ‌డంలో రోడ్డు అంతా స్థంభించింది. త‌ట్టెప‌ల్లిని కొత్త మండ‌లంగా ప్ర‌క‌టించాల‌ని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా మండ‌ల సాధ‌న క‌మిటితో పాటు ప‌లువురు మాట్లాడుతూ 70 ఏండ్లుగా త‌ట్టెప‌ల్లిని మండ‌లంగా ప్ర‌క‌టించాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నార‌ని తెలిపారు. ఇటీవ‌ల‌ తెంల‌గాణ ప్ర‌భుత్వం కొత్త‌గా ఏర్పాటు చేసిన 13 మండ‌లాల్లో త‌ట్టెప‌ల్లికి మొండిచెయ్యి చూపించి నిరాశ ప‌రిచింద‌న్నారు. ఏడు ఎంపీటీసీ స్థానాల‌ను సాకుగా చూపించ‌డం ఒప్పుకొన్నామ‌రు. జ‌నాభా ప్ర‌తిపాధిక‌న త‌క్కువ జ‌నాభా ఉన్న ప్రాంతాల‌నే మండ‌లాలుగా ప్ర‌క‌టించార‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో మంత్రుల ఒత్తిడి మేరకు 13 మండ‌లాలే కాక‌, కొత్త‌గా మ‌రో మండ‌లాన్ని ప్ర‌క‌టించార‌ని అన్నారు. జ‌నాభా ప్ర‌తిపాదిక‌గా చూసుకుంటే త‌ట్టెప‌ల్లి ఏడు ఎంపీటీసీ స్థాన‌ల‌కు స‌మామ‌న్నారు. కావున మాకు కొత్త మండ‌లాన్ని ప్ర‌క‌టించి తీరాల‌ని డిమాండ్ చేశారు. దీనిపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి, జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ సునితారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డిలు దృష్టిసారించాల‌ని అన్నారు. లేదంటే ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ప‌ల్లెలోకి రానివ్వ‌మ‌న్నారు. ప్ర‌జల ఆకాంక్ష మేర‌కు త‌ట్టెప‌ల్లిని మండ‌లంగా నెర‌వేర్చ‌క‌పోతే అందోళ‌న‌ను ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు.