కుర్చీ కిక్.. సైడ్ ట్రాక్..!
– ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కోట్లోకి బంతి
– మరింత ముదిరిన మున్సిపల్ వివాదం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరు మున్సిపల్‌లో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పదవి వ్యవహారం సైడ్ ట్రాక్ తీసుకుంది. కుర్చీ దిగేదిలేదు.. కుర్చీ దిగాల్సిందే అంటూ ఇద్దరి మద్య సాగిన యుద్ద వాతావరణం ఒక్కసారిగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిల మద్యకు మళ్లింది. రెండున్నరేళ్ల ఒప్పందంపై నిన్నటి వరకు అటు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌కు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఇటు వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు పరోక్షంగా మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మద్యే కుర్చీ దిగడం, దించడం పంచాయతీ కొనసాగింది. దిగేది లేదని చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పంథం పడితే.. దించేందుకు వైస్ చైర్ పర్సన్ దీపా పట్లోళ్ల నర్సింలులు పట్టును వీడలేదు. ఆఖరుకు పంచాయతీ పరిష్కార భారం కాస్తా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల కోట్లోకి చేరింది. కుర్చీ ఫైట్ టర్నింగ్‌త్ మళ్లీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మద్య వర్గపోరు వ్యవహరం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చైర్ పర్సన్ చేత ఒప్పందాన్ని అమలు చేయడం లేదని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మీడియా ముందు ఆరోపణలు చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చైర్ పర్సన్‌ను దించేది లేదని తేల్చి చెప్పినట్లు ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల గ్రౌండ్‌లోకి వెళ్లిన ఒందప్పం పోరులో ఎవరు పైఎత్తు సాధిస్తారనేది తాండూరుతో పాటు వికారాబాద్ జిల్లా, రాష్ట్రస్థాయి రాజకీయాలలో తీవ్ర రసవత్తరాన్ని పెంచింది. గురువారం రాత్రి వరకు ఉత్కంఠతను రేపిన ఈ వ్యవహారంలో చివరకు రెండు, మూడు రోజులు వేచి చూద్దామని ఇరువర్గాలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.



