దివ్యాంగుల సేవకు తోడ్పాటు
– డా.సంపత్ కుమార్, కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య
– తాండూరులో సక్షమ్ దివ్యాంగ్ కేంద్రం ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : దివ్యాంగుల సేవకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని తాండూరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ సంపత్ కుమార్, తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్యలు అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలో ధీమహీ రిహాబిలిటేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సక్షమ్ తెంలగాణ దివ్యాంగ సేవా కేంద్రం ఏర్పాటు చేశారు.

ఈ కేంద్రాన్ని డాక్టర్ సంపత్ కుమార్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో దివ్యాంగుల పట్ల ఎవ్వరు వివక్ష చూపరాదన్నారు. దివ్యాంగులకు సేవ చేయడం ఎంతో గొప్ప కార్యక్రమం అన్నారు. సక్రమ్ దివ్యాంగ సేవా కేంద్రం చేస్తున్న సేవకు తమ వంతు తోడ్పాటు అందిస్తామన్నారు.
అదేవిధంగా ఈ సేవా కేంద్రంలో ముగ్గురు చిన్నారులు ఫిజియోథెరఫి సేవలను పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండంతో కోట్రిక విజయలక్ష్మీ వారికి కొత్త బట్టలను పంపిణీ చేశారు. అదేవిధంగా తాండూరులో 158 సార్లు రక్తదానం చేసిన డాక్టర్ సంపత్ సారును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్, సక్షమ్ తెలంగాణ ఇంచార్జ్ లిలా కృష్ణ, రమేష్, సుజాత, ఫిజియో థెరఫీ వైద్యులు రాకస్త కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

