శివుడి సేవ‌లో మంకాల రాఘ‌వేంద‌ర్

తాండూరు రాజకీయం వికారాబాద్

శివుడి సేవ‌లో మంకాల రాఘ‌వేంద‌ర్
– న‌గేరేశ్వ‌రంలో శ్రావ‌ణ మాస పూజ‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ప‌ర‌మ శివుని సేవ‌లో తాండూరు మున్సిప‌ల్ 26వ వార్డు కౌన్సిల‌ర్ మంకాల రాఘ‌వేంద‌ర్ త‌ర‌లించారు. శుక్ర‌వారం శ్రావ‌ణ‌మాసం ప్రారంభం కావ‌డంతో ప‌ట్ట‌ణంలోని శ్రీ న‌గ‌రేశ్వ‌రాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. స‌తీమ‌ణితో క‌లిసి శివున్ని ద‌ర్శించుకుని పూజ‌లు నిర్వ‌హించారు. పురోహితుని మంత్రోచ్చ‌ర‌ణల మ‌ద్య శివునికి పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తాండూరు ప్ర‌జ‌లను స‌ల్లంగా చూడాల‌ని శివున్ని ప్రార్థించిన‌ట్లు తెలిపారు. శ్రావ‌ణ మాసంలో అంద‌రు ఆధ్యాత్మిక చింత‌న‌ను అల‌వ‌ర్చుకోవాల‌న్నారు.