బాలాజీ చిట్స్ ప్రైవేట్ లిమిటేడ్‌పై చీటింగ్ కేసు

క్రైం తాండూరు వికారాబాద్

బాలాజీ చిట్స్ ప్రైవేట్ లిమిటేడ్‌పై చీటింగ్ కేసు
– బాధితుల ఫిర్యాదు మేర‌కు నిర్వహకులపై న‌మోదు
– ప్ర‌క‌ట‌న‌లో ప‌ట్టణ సీఐ రాజేంద‌ర్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు పట్టణంలోని బాలాజీ చిట్స్ ప్రైవేట్ లిమిటేడ్ నిర్వహకులపై చీటింగ్ కేసు న‌మోద‌య్యింది. చిట్స్ ప్రైవేటు లిమిటేడ్ బాధితుల ఫిర్యాదు మేర‌కు ఈ కేసును న‌మోదు చేసిన‌ట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల బాలాజీ చిట్స్ ప్రైవేటు లిమిటేడ్ దివాల తీసిన విషయం తెలిసిందే. దీంతో అందులో డిపాజిట్ చేసిన వారితో పాటు చీటీలు వేసిన గోపాల్ గారి బల్వంత్ రెడ్డి, పీ.రమేష్, విజయ్ ఆనంద్, సునీల్ కుమార్, లక్ష్మీకాంత్, మేడిశెట్టి సంగయ్య, మేడిశెట్టి మంజుల, ఎస్ అనిత, మంజుల కందుకూరు కృష్ణారెడ్డి, స్వర్ణలత, మహేష్ పటేల్, నర్మదా, వంశీకృష్ణ, బి.కృష్ణారెడ్డి తదితరుల ఫిర్యాదు మేరకు మేనేజింగ్ డైరెక్టర్స్ గంగిశెట్టి శ్రీనివాసులు, గంగిశెట్టి గొ పాలకృష్ణ, గంగిశెట్టి అనురాధ, గంగిశెట్టి సరిత తదితరులపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిర్వహకులపై చీటింగ్ కేసు, చిట్ ఫండ్ యాక్టు కేసు, ఆర్బీఐ యాక్టు కేసు నమోదు చేసినట్లు సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.