ఇంటింటిపై జాతీయ జెండా

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇంటింటిపై జాతీయ జెండా
– అమృత్ మ‌హోత్స‌వ్‌, వ‌జ్రోత్స‌వాలకు ప‌క్కా ఏర్పాట్లు
– ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారుల మ‌ద్య స‌మ‌న్వ‌య లోపం
– 15 త‌రువాత యంత్రాంగంపై ద‌ర్నాల దండ‌యాత్ర‌
– మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ గుప్త‌
– ప్ర‌శాతంగా కౌన్సిల‌ర్ అత్య‌వ‌స‌ర స‌మావేశం
– వైస్ చైర్ ప‌ర్స‌న్, కౌన్సిల‌ర్ల డుమ్మా
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజారీకా అమ్మత్ మ‌హోత్సవ్, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వ‌జ్రోత్స‌వాల ద్వారా తాండూరులో ఇంటింటిపై జాతీయ జెండా ఎగుర‌వేస్తామ‌ని మున్సిప‌ల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్త పేర్కొన్నారు. శనివారం తాండూరు అత్యవసర సమావేశం ప్ర‌శాతంగా కొన‌సాగింది. ఈ స‌మావేశానికి వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు, ప‌లువురు కౌన్సిల‌ర్లు గైర్హాజ‌రు అయిన‌ప్ప‌టికి 18 మంది కౌన్సిల‌ర్లు, ఇద్ద‌రు కోఆప్ష‌న్ స‌భ్యుల ఆమోదంతో ఏజెండాను ఆమోదించ‌డం జ‌రిగింద‌ని చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ స్ప‌ష్టం చేశారు. స‌మావేశం అనంత‌రం చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఎజెండా అంశాలను మీడియాకు వివరించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఆజాబితా అమృత్‌ మహోత్సవ, స్వాతంత్ర భారత వ‌జ్రోత్స‌వ్ ద్వి సప్తాహ కార్యక్రమాల‌లో భాగంగా ఇంటింటిపై జాతీయ ఎగుర‌వేసేలా దృష్టిసారిస్తున్నామ‌న్నారు. 5మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి ప్ర‌తి వార్డుకు కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు. అదేవిధంగా సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్లాస్టిక్ నిషేధం అంశాలను చర్చించి ఆమోదించడం జరిగిందన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం ప్రతి ఆదివారం 10 గంటల కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. మిషన్ భగీరథ లీకేజీల మరమ్మత్తులు, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, అయిల్ బాల్స్ వేయడం వంటి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం 50 మైక్రోన్ ల కన్నా తక్కువగా ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం అమల్లో ఉందన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించాలన్నారు.

స‌మ‌స్య‌ల‌పై అధికారుల నిర్ల‌క్ష్యం – వారం త‌రువాత ద‌ర్నాలు
ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో అధికారులు, కౌన్సిల‌ర్ల మ‌ద్య స‌మ‌న్వ‌యలోపం పెరుగుతోంద‌న్నారు. కౌన్సిల‌ర్లు సూచించిన స‌మ‌స్య‌ల‌ను అధికారులు ప‌రిష్క‌రించ‌కుండా నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని, అధికారుల యంత్రాంగ వ్య‌వ‌స్థ అస్త‌వ‌స్తంగా త‌యారైంద‌న్నారు. వీధులలో కుక్కల స్వర విహారంపై ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. పందుల సంచారంతో ప్రజలు అవస్థలు పడుతున్నాయని దృష్టికి తెచ్చినా చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌న్నారు. చెత్త తరలింపులో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. సాయిపూరులో తాగునీటి సమస్య ఉందని చెబితే ట్రాక్టర్ డ్రైవర్ డిజిల్ లేదని చెప్పాడని మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల ఆరోపించారు. సమస్యలపై అడిగేందుకు ఫోన్ చేస్తే డీఈ, ఏఈలు పోన్ ఎత్తడం లేదని ఫ్లోర్ లీడర్ శోభారాణి ఆరోపించారు. వారం రోజుల్లో కౌన్సిలర్లు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించకపోతే వారికి వ్యతిరేకంగా దర్నాలతో దండయాత్ర చేస్తామని పేర్కొన్నారు. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, అబ్దుల్ రజాక్, ప్రవీణ్ గౌడ్, బోయ రవిరాజు, రాము, వెంకన్న గౌడ్, సల్మా పాతిమా, సాహు శ్రీలత, అంతారం లలిత, లావణ్య, పూజ, మమత, మధుబాల, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖని, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ రంగనాథం తదితరులు పాల్గొన్నారు.

మండిపడిన మాజీ వైస్ చైర్మన్

కౌన్సిల్ సమావేశానికి వైస్ చైర్ పర్సన్ ప‌ట్లోళ్ల దీపా నర్సింలు, ఇతర కౌన్సిలర్లు గైర్హాజరు కావడం పట్ల ఎంఎంఐ మాజీ వైస్ చైర్మన్, ఫ్లోర్ లీడర్ సయ్యద్ సాజిద్ ఆలీ మండిపాటు వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వాతంత్ర దినోత్సవం ప్రతిష్టాత్మకంగా చేపట్టే కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి.. రాకపోవడం విడ్డూరమన్నారు. చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ మధ్య జరిగే రాజకీయాలతో సమావేశానికి దూరంగా ఉన్నట్లు సందేశం వెళుతుందన్నారు. అలాంటివి ఏమైనా ఉంటే పక్కన పెట్టాలని, పట్టణ అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై దృష్టిసారించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.