కొత్తగా 10 లక్షల మందికి ఫించన్లు
– లబ్దిదారులకు స్వాతంత్ర్య వజ్రోత్సవాల కానుక
– ప్రకటించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని కొత్త ఫించన్ లబ్దిదారులకు సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పారు. శనివారం ప్రగతి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కొత్త ఫించన్ల మంజూరుపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా 10లక్షల మందికి పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 36లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మొత్తం పింఛన్దారుల సంఖ్య 46లక్షలకు చేరుకుంటుందని చెప్పారు. 57 సంవత్సరాలున్న వారికి పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా డయాలసిస్ పేషెంట్లకు సైతం పింఛన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. డయాలసిస్ పేషెంట్లకు రూ.2016 పింఛన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.



