దేశభక్తిని పెంపొందించుకోవాలి
– మహనీయుల స్పూర్తిని మరవొద్దు
– కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు, 25వ వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. గురువారం వజ్రోత్సవాలలో భాగంగా తన వార్డులోని శివమ్ గ్రామర్ స్కూళ్లో ఏర్పాటు చేసిన వేడుకలకు ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు. 75వ స్వాతంత్య్ర దినో త్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వజ్రోత్సాలలో భాగంగా స్కూల్ ఆవరణలో ప్రభాకర్ గౌడ్ యజమాన్యంతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల స్ఫూర్తితో దేశానికి స్వాతంత్య్రం సాధించుకున్నామని అన్నారు. మహనీయుల స్పూర్తితో విద్యార్థులతో పాటు అందరు దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు. మరోవైపు వజ్రోత్సవాలలో భాగంగా నాటిన మొక్కలను బాధ్యతగా సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యజమాన్యం, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.



