హస్తంలో కరోనా కలకలం
– మరోసారి వైరస్ బారిన పడిన సోనియాగాంధీ
– టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి పాజిటివ్
దర్శిని డెస్క్ : హస్తం పార్టీలో కరోనా మహమ్మారిని కలపెడుతోంది. ఆ పార్టీలో కీలక నేతలు వైరస్ బారిన పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరోమారు కరోనా బారిన పడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ముందు సోనియాగాంధీ కరోనా బారిన పడ్డారు. కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. పోస్ట్ కరోనా ఇబ్బందుల నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా శనివారం మరోమారు సోనియాలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోగా… ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడ కరోనా బారిన పడ్డారు. అనారోగ్య కారణాలతో పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. ఈ కారణంగా మునుగోడులో జరిగే పాదయాత్రకు రేవంత్ రెడ్డి దూరమయ్యారు. దీంతో రేవంత్ రెడ్డి సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు.



