సీఎం సహాయ నిధి పేదలకు వరం

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎం సహాయ నిధి పేదలకు వరం
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– అర్హులకు సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీల అందజేత
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : పేదల ఆరోగ్యానికి భరోసానిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎం సహాయ నిధి పథకం వారికి వరంగా మారిందని ఉమ్మడి. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణానికి చెందిన జగదేవికి రూ. 60 వేలు, బిల్‌క్విన్‌ కి రూ. 60 వేలు, పాత తాండూరుకు చెందిన ప్రశాంత్ కుమార్ కు రూ. 32 వేలు, తాండూరు మండలం మల్కాపూర్ కు చెందిన రాఘవేణి కి రూ. 56 వేలు, ప్రియాంకకు రూ.30 వేలు, బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ కు చెందిన శ్రీనివాస్ కు రూ. 40 వేలు, పర్వత్ పల్లికి చెందిన మాణిక్యమ్మకు రూ. 41 వేలు, జలాల్ పూర్ కు చెందిన రూ. 60 వేలు సీఎం ఆర్ఎఫ్ కింద మంజూరయ్యాయి.

ఆదివారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నియోజకవర్గంలోని పలువురు లబ్దిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలను అందజే చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరం అని, అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ఈ పథకం భరోసా కల్పిస్తుందన్నారు. ఈ పథకాన్ని వైద్యం చేయించుకోలేని పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ రవీందర్ గౌడ్, బషీరాబాద్ జెడ్పీటిసి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ కౌన్సిలర్ జుబేర్‌లాల‌, కౌన్సిల‌ర్ బోయ‌ర‌విరాజు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, కోఆప్షన్ సభ్యులు శంషోద్దీన్, నాయకులు పండరి, మాజీ డైరెక్టర్ మొయినోద్దీన్, అమిద్, బందెప్ప, మొగులప్ప, ఎల్లప్ప, కాశినాథ్, శివప్ప, మాణిక్ రెడ్డి, నారాయణ రెడ్డి, బన్సిలాల్ తదితరులు పాల్గొన్నారు.