విద్యార్థులకు మార్వాడీ యువమంచ్ కానుక
– 110 పేద విద్యార్థులకు బూట్లు, సాక్సు పంపిణీ
– మంచ్ సేవలకు నేతల అభినందన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్వాడి యువమంచ్ సభ్యులు గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద విద్యార్థులకు కానుక అందజేశారు. మంగళవారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలోని కుప్పన్ కోట్, బహదూర్పూర్ తాండా, బహదూర్పూర్ గ్రామాల్లోని మూడు పాఠశాలలో 110 మంది విద్యార్థులకు బూట్లు, సాక్సులు, పెన్నులు, బిస్కెట్లు పంపిణీ చేశారు. మంచ్ సభ్యులు బంకట్ లాల్, నందకిషోర్ పర్తానీల ఆర్థిక సహాయంతో దినేష్ వర్తాని ద్వారా విద్యార్థులకు అందజే శారు. బషీరాబాద్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మండల వైస్ ఎంపీపీ అన్నపూర్ణ, సర్పంచులు, ఉపసర్పంచుల సమక్షంలో విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా నేతలు విద్యార్థుల కోసం మార్వాడి యువమంచ్ చేస్తున్న సేవలను కొనియాడుతూ అభినందించారు. మంచ్ సభ్యులు మాట్లాడుతూ విద్యాదానం మహాదానం అని, విద్యార్థులకు మంచ్ తోడ్పాటు అందిస్తుందన్నారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, తాండూరు అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బూబ్, కార్యదర్శి కిషన్ గోపాల్ రాఠి, అరుణ్ కుమార్ సార్డా, జాతీయ కన్వీనర్ కుంజ్ బిహారి సోని, సూర్య ప్రకాష్ సోమాని, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.


