సీఎంఆర్ఎఫ్ పేదలకు అండ
– చెక్కును అందజేసిన మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అండగా నిలుస్తోందని తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల అన్నారు. పట్టణంలోని 21వ వార్డులోని బి.నర్సింలు అనారోగ్యానికి గురికావడంతో జుబేర్ లాల ద్వారా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని సంప్రదించారు. దీంతో సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా బాధితునికి రూ. 60వేలు మంజూరయ్యాయి. ఆదివారం మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల లబ్దిదారునికి కుటుంబానికి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జుబేర్ లాల మాట్లాడుతూ అనారోగ్యంతో వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం అండగా నిలుస్తొందన్నారు. సీఎం సహాయ నిధి మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.


