రామ‌లింగేశ్వ‌రుని సేవ‌లో ఎమ్మెల్సీ

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

రామ‌లింగేశ్వ‌రుని సేవ‌లో ఎమ్మెల్సీ
– ఏకాంబ‌రిలో పూజ‌లు నిర్వ‌హించిన మ‌హేంద‌ర్ రెడ్డి
– స్వాగ‌తం ప‌లికి స‌న్మానించిన ఆల‌య క‌మిటి స‌భ్యులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు నియోజ‌క‌వ‌ర్గం బ‌షీరాబాద్ మండ‌లం నీళ్ల‌ప‌ల్లి స‌మీపంలోని ప్ర‌కృతి ఒడిలో వెల‌సిన శ్రీ ఏకాంబ‌రి రామ‌లింగేశ్వ‌రుని సేవ‌లో ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి త‌రించారు. శ్రావ‌ణ‌మాసం ఆఖ‌రి సోమ‌వారం సంద‌ర్భంగా ఏకాంబ‌రిలోని శ్రీ రామ‌లింగేశ్వ‌ర దేవాయ‌లంలో జాత‌ర ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి దేవాల‌యాన్ని సంద‌ర్శించారు. ఆల‌యంలో వెల‌సిన శ్రీ‌రామ‌లింగేశ్వ‌రునికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి ద‌ర్శించుకున్నారు. అంత‌కుముందు ఆల‌య క‌మిటి స‌భ్యులు ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డికి ఘ‌నంగా స్వాగ‌తం పలికారు. ద‌ర్శ‌నం అనంత‌రం మ‌హేంద‌ర్ రెడ్డిని శాలువాతో స‌న్మానించారు.

ఎమ్మెల్సీ వెంట బ‌షీరాబాద్ జెడ్పీటీసీ శ్రీ‌నివాస్ రెడ్డి, నాయ‌కులు సుధాక‌ర్ రెడ్డి, శ్రీ‌నివాస్ రెడ్డి, ప‌ట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బాబు, పీకే న‌ర్సింలు, మ‌ధుసూధ‌న్ రెడ్డి, వెంక‌ట్ రెడ్డి, వెంక‌ట‌య్య‌, రాజు, గౌత‌మ్, వేణు, దుర్గ‌య్య‌, అశోక్ త‌దిత‌రులు ఉన్నారు.