పేద‌ల‌కు తోడు.. వృద్ధుల‌కు భ‌రోసా

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

పేద‌ల‌కు తోడు.. వృద్ధుల‌కు భ‌రోసా
– అర్హుల‌కు ఆస‌రా అందిస్తున్న సీఎం కేసీఆర్
– మున్సిప‌ల్ మాజీ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల ర‌త్న‌మాల న‌ర్సింలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న ఆస‌రా ప‌థ‌కం పేద‌ల‌కు తోడు.. వృద్ధుల‌కు భ‌రోసా అందిస్తుంద‌ని తాండూరు మున్సిప‌ల్ మాజీ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల ర‌త్న‌మాల న‌ర్సింలు అన్నారు. మంగ‌ళ‌వారం సాయిపూర్‌లోని త‌న వార్డు 10లో ప్ర‌భుత్వం మంజూరు చేసిన ఆస‌రా గుర్తింపు కార్డుల‌ను ర‌త్న‌మాల న‌ర్సింలు త‌న చేతుల మీదుల‌కు ల‌బ్దిదారుల‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌భుత్వం దేశంలో ఎక్క‌డాలేని విధంగా 57 ఏండ్ల‌కే వృద్ధుల‌కు ఆస‌రా ఫించ‌న్ అంద‌స్తున్నార‌ని అన్నారు. దీంతో పాటు అర్హులైన వారికి ఆస‌రా ఫించ‌న్ అందిస్తూ ఆదుకుంటున్నార‌ని అన్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఆస‌రాతో వృద్ధుల‌కు భ‌రోసా.. పేద‌ల‌కు ఆర్థిక చేయూత అంద‌తుందన్నారు. ఈ ప‌థ‌కాన్ని ల‌బ్దిదారులు స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ బిల్ క‌లెక్ట‌ర్ హైమ‌ద్, జ‌వాన్ బొట్టు శ్రీ‌ను, వార్డు పెద్ద‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.