శంకరన్న కొడుకు గ్రేట్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

శంకరన్న కొడుకు గ్రేట్..!
– ప్యాకెట్ మనీతో విద్యార్థులకు నోటు పుస్తకాలు
– స్వయంగా అందజేసిన శంకర్ యాదవ్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ కుమారుడు అభినవ్ సాయి గ్రేట్ అనిపించుకున్నారు. తన ప్యాకెట్ మనీతో నోటు పుస్తకాలను కొని విద్యార్థులకు పంపిణీ చేసి సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి శంకర్ యాదవ్ హాజరై విద్యార్థులకు తన చేతులతో నోటు పుస్తకాలను అందజేశారు. అదేవిధంగా శంకర్ యాదవ్ కూతురు తులసీ జన్మదిన వేడుకలు విద్యార్థుల మద్య జరుపుకోవడం విశేషం.

ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ కుమారుడు అభినవ్ సాయి చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు. చిన్న వయస్సులోనే సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా పలువురు శంకర్ యాదవ్ కుమారుడు చేసిన సేవాకార్యక్రమాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వినోద్ కుమార్, మాజీ సర్పంచ్ సాయిలు, గ్రామ పెద్దలు కోతి గోపాల్, నవీన్ రెడ్డి, సురేష్, మిత్రులు మనోహర్, మల్లప్ప, ఏఏసీపీ చైర్మన్ రేణుక, వీఓఏ భాగ్యలక్ష్మీ, పంచాయతీ కార్యదర్శి సునీత, మల్ రెడ్డి, శ్రీనివాస్, కిరణ్, ఉపాధ్యాయులు శారద, శ్వేత, వజ్రమాల, శంకర్ యాదవ్ కూతురు వైష్ణవి, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

అందరు స్వచ్ఛతను కొసాగించాలి