గోడ‌ల‌పై పిచ్చిగీత‌లెందుకు..?

తాండూరు రాజకీయం వికారాబాద్

గోడ‌ల‌పై పిచ్చిగీత‌లెందుకు..?
– టీఆర్ఎస్‌లో ఉన్న‌ట్టా.. లేనట్టా
– ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న‌ జిల్లా గ్రంథాల‌య చైర్మ‌న్
– తాండూరు ప‌ట్ట‌ణ యువ‌జ‌న అధ్య‌క్షులు అనిల్ బాండ్‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: గోడ‌ల‌పై పిచ్చి గీత‌ల‌ను ఎందుకు గీయిస్తున్నార‌ని వికారాబాద్ జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ ముర‌ళీకృష్ణ‌గౌడ్‌పై టీఆర్ఎస్ పార్టీ తాండూరు ప‌ట్ట‌ణ యువ‌జ‌న విభాగం అధ్య‌క్షులు అనిల్ బాండ్ సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో మండిప‌డ్డారు. గత మూడు సంవత్సరాలుగా మురళీకృష్ణ పోకడలు విచిత్రంగాను, విడ్డూరంగాను ఉన్నాయని విమర్శించారు. అధికార పార్టీలో ఉంటూ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించే విధంగా తాండూరులో గోడల మీద పిచ్చి రాతలు రాయడం నీతిమాలిన పని అన్నారు. ఇలాంటి విధానాల‌కు పాల్ప‌డున్న మీరు టీఆర్ఎస్‌లో ఉన్న‌ట్టా.. లేనట్టా అంటూ ప్ర‌శ్నించారు. సిగ్గుచేటు విధానాల‌కు పాల్ప‌డుతున్న ఆయ‌న‌ గ్రంథాలయ చైర్మన్ పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాలు చేయాలనుకుంటే ఏదో ఒక పార్టీలో చేరి స‌త్తా నిరూపించుకోవాల‌ని స‌వాల్ చేశారు. గ‌తంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెంట న‌డిచిన ఆయ‌న తెర‌చాటు రాజకీయాల‌తో వెన్నుపోటు పొడిచేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. రాజ‌కీయం కోసం ప్ర‌జ‌ల‌ను మోసం చేసేందుకు కొత్త ఎత్తుగ‌డ‌ల‌ను ప్ర‌వేశ పెడుతున్నార‌ని అన్నారు. ఎన్నిక‌ల్లోకి పోటీచేయాల‌ని భావిస్తే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయరని అన్నారు. గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు ప్రాంతానికి చేస్తున్న‌ అభివృద్ధి పనులను చూస్తూ ఓర్వలేక ప్రతిపక్షాలతో చేతులు కలిపి.. నీతిమాలిన రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇప్పటికైనా ప‌ద్ద‌తి మార్చుకోవాల‌ని, లేదంటే టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు త‌గిన గుణ‌పాఠం చెప్తార‌ని హెచ్చ‌రించారు.