కోవిడ్ నిబంధనలపై నిర్ల‌క్ష్యం వ‌హించొద్దు

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

కోవిడ్ నిబంధనలపై నిర్ల‌క్ష్యం వ‌హించొద్దు
– తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్
తాండూరు రూరల్, ద‌ర్శిని ప్ర‌తినిధి : అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో క‌రోనా కొవిడ్ నిబంధనలపై నిర్లక్ష్యం వహించరాదని మండల విద్యాధికారి వెంకటయ్యగౌడ్ అన్నారు. మంగళవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో తాండూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్ పరిస్థితులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తోందన్నారు. కావున పాఠశాలల్లో కరోనా పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా నిబంధనలు పాటించేలా దృష్టిసారించాలని ఆదేశించారు. అదేవిధంగా పాఠశాలలో ఆన్లైన్ డాటా, మధ్యాహ్న భో జనం సక్రమంగా అమలు చేయడంతో పాటు సమయ పాలన, ఉపాధ్యాయుల సర్దుబాటు, నాణ్యమైన విద్యా బోధన అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య, మృత్యుంజయ స్వామి, వైద్యనాథ్, జైపాల్ రెడ్డి, నర్సి రెడ్డి, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.