చేనేత హస్తకళలను ఆదరిద్దాం..!
– తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి: చేనేత హస్తకళలను ఆదరిద్దామని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం తాండూరు పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ చేనేత హస్తకళలు మన సంప్రదాయమన్నారు. వాటిని అందరు ప్రోత్సహించి ఆదరించారు. అదేవిధంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా 40 మంది డ్వాక్రా మరియు చేనేత హస్త కళాకారుల పాల్గొంటున్నారు అని తెలిపారు. ఈ ప్రదర్శనలో పోచంపల్లి, నారాయణపేట, ఉప్పాడ, చీరాల ,మంగళగిరి, కలంకారి ,ఫ్యాన్సీ కాటన్, ప్రింటెడ్ బెంగాల్ సిల్క్స్, భాగల్పూర్ బాందిని సిల్క్, గుజరాత్ డిజైన్స్, లక్నో చికెన్ వర్క్స్, డోర్ కర్టన్స్, డోర్ మాట్స్, వరంగల్ టవల్స్ ,బెడ్ షీట్స్, రాజస్థానీ ప్రింటెడ్ టాప్స్, జైపూర్ టాప్స్, జైపూర్ బెడ్ షీట్స్, వివిధ రకాల ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రదర్శనను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్ రాజు గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అఫ్పూ(నయూం), మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, ఎంపీటీసీ సాయి రెడ్డి, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.


