తాండూరు పట్టణ ప్రజలకు అలర్ట్
– 18 నుంచి రెండు రోజులు తాగునీటిసరా బంధ్
– ప్రకటించిన మున్సిపల్ అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ ప్రజలకు మున్సిపల్ అధికారులు అప్రమత్త సూచన చేశారు. ఈనెల 18(సోమవారం, మంగళవారం) నుంచి రెండు రోజులు పట్టణంలో తాగునీటి సరఫరాకు అంతరాయం విధిస్తున్నట్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని విలియమూన్ చౌరస్తా వద్ద ఉన్న తాగునీటి సరఫరా ప్రధాన పైపులైన్ మరమ్మత్తులు చేపడుతున్నట్లు వెల్లడించారు. దీని కారణంగా 18,19వ తేదిలలో తాగునీటి సరఫరా ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. రెండు రోజుల తాగునీటి అంతరాయానికి అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.



