ఉర్సు ఉత్స‌వాల‌కు రండి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఉర్సు ఉత్స‌వాల‌కు రండి..!
– ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డికి ఆహ్వానం
– స‌న్మానించిన నిర్వ‌హ‌కులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులోని ముర్ష‌ద్ ద‌ర్గాలో ప్ర‌తియేడాది ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఉర్సు ఉత్స‌వాల‌కు హాజ‌రుకావాల‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డిని నిర్వ‌హ‌కులు ఆహ్వానించారు. గురువారం ప‌ట్ట‌ణంలోని ఎమ్మెల్సీ నివాసంలో ఉత్స‌వ నిర్వ‌హ‌కులు సయ్యద్ బాషా త‌దిత‌రులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని మ‌ర్యాద పూర్వకంగా క‌లిశారు. ముర్ష‌ద్ ద‌ర్గాలో నిర్వ‌హిస్తున్న 76వ ఉర్సు ఉత్స‌వాల‌లో పాల్గొనాలని ఆహ్వానించారు. అనంత‌రం ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డిని శాలువాతో స‌న్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తం రావు, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్, మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ ర‌వూఫ్, మాజీ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల‌ రత్నమాల నర్సింహులు, కౌన్సిల‌ర్లు అబ్దుల్ రజాక్, మాజీ కౌన్సిల‌ర్ జుబేర్ లాల‌, సయ్యద్ భాష, సయ్యద్ మన్సూర్ పాషా, సయ్యద్ ముక్తాదిద్ భాష, సయ్యద్ సాదర్ భాయ్, సయ్యద్ ఉమర్ పాషా, సయ్యద్ అతిఫ్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు.