ఆలయ నిర్మాణానికి విఠల్ నాయక్ ఆర్థిక చేయూత
– వీరబ్రహ్మేంద స్వామి దేవాలయానికి రూ. 51వేల విరాళం
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేవాలయ నిర్మాణానికి తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ చేయూతనందించారు. యాలాల మండల కేంద్రంలో నిర్మిస్తున్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ నిర్మాణానికి రూ. 51వేల ఆర్థిక సహాయం అందజేశారు. మంగళవారం తాండూరు మార్కెట్ కమిటి కార్యాలయంలో తనను కలిసిన యాలాల మండల విశ్వకర్మ సంఘం సభ్యులకు ఈ విరాళం అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ దైవానుగ్రహంతోనే అందరు మానసిక, ఆయువు, ఆరోగ్యం, అభివృద్ది పొందుతారని అన్నారు. దేవాలయ నిర్మాణంలో తనవంతు సహాయంగా విరాళం అందించడం జరిగిందని, అందరికి వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహం సిద్దించాలని ఆకాంక్షించారు.


