మహనీయుల త్యాగాలు మరువలేనివి
– సీఎం కేసీఆర్ కృషితో సంక్షేమం వైపు తెలంగాణ
– వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సాధనలో మహనీయుల త్యాగాలు మరువలేనివని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. శనివారం జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో చైర్మన్ రాజుగౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ భారతదేశంలో విలీనం అయ్యిందని గుర్తుచేశారు. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి వచ్చేందుకు మహానీయులు చేసిన త్యాగాలు మరువలేని వన్నారు. వారి త్యాగాలు గుర్తించి రాష్ట్ర ఔనత్యాన్ని చాటేందుకే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిలో సంక్షేమం వైపు నడుస్తోందని, దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అంతకుముందు అందరికి జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే ఆనంద్‌ను కలిసిన రాజుగౌడ్

అంతకుముందు వికారాబాద్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజుగౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


