పొలంకాడ కొట్లాట..!
– వృద్దులపై రెచ్చిపోయిన ఎంపీటీసీ భర్త
– కర్రలతో దాడి చేయడంతో తీవ్రగాయాలు
– నవాబ్‌పేట్ పుల్‌మామిడిలో ఘటన
– ఆరా తీసిన వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : పొలం వద్ద జరిగిన ఓ కొట్లాట వికారాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. భార్య ప్రజా ప్రతినిధురాలుగా ఉంటే భర్త హోదాలో ఆదర్శంగా నిలవాల్సిన ఆయన అరాచానికి పాల్పడ్డారు. పొలం వద్ద ఒంటిరిగా ఉన్న వృద్దులపై ధాడి చేసి హత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా నవాబు పేట మండల పరిధిలోని పులుమామిడి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నవాబు పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పులు మామిడి గ్రామానికి చెందిన వృద్దులు తెలుగు యాదయ్య, ఆయన భార్య పోలం వద్ద ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ, ఆమె భర్త రామక్రిష్ణ రెడ్డి, ఆయన భార్య తమ్ముడు శ్రీనివాస్ రెడ్డిలు కలిసి కర్రలతో వృద్దులపై ధాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో యాదయ్య, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న వృద్దులను వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. పొలం అమ్మకం విషయంలో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయని బాధితులు తెలిపారు. పొలం అమ్మడం లేదనే అక్కసుతో దాడి చేశారని ఆరోపించారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. మరోవైపు పొలం వద్ద వృద్ధులపై దాడి జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆరా తీశారు. దాడికి పాల్పడిన వారిపై నవాబ్ పేట్ పోలీస్టేషన్‌లో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకవడం జరిగిందని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


