నవరాత్రి ఉత్సవాలకు సౌకర్యాలు కల్పించండి

తాండూరు రాజకీయం వికారాబాద్

నవరాత్రి ఉత్సవాలకు సౌకర్యాలు కల్పించండి
– ఆర్డీఓకు వినతిపత్రం అందించిన ప్రవీణ్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం బసవణ్ణ కట్ట నిర్వహిస్తున్న దేవి నవరాత్రి ఉత్సవాలకు సకల ఏర్పాట్లు కల్పించాలని ఆర్డీఓ అశోక్ కుమార్‌ను 33వ వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ గౌడ్ కోరారు. గురువారం ఆర్డీఓ అశోక్ కుమార్‌ను ఉత్సవ కమిటి సభ్యులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ బసవణ్ణ కట్ట వద్ద నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ సారి 25 ఏండ్లు పూర్తి చేసుకోబోతుందని, ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాలలో పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీటి వసతి సౌకర్యాలు కల్పించే విధంగా చొరవ చూపాలని ఆర్డీఓను విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆర్డీఓ అశోక్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటి అధ్యక్షులు రమేష్ శిందే, కార్యదర్శి సాయి రెడ్డి, కోశాధికారి లోకేష్, సభ్యులు అమిత్ శిందే, వడ్డె అంజి, నగేష్ గాద్రే తదితరులు ఉన్నారు.