ఎంఎంటీఎస్ రైళ్ల స‌ర్వీసు ర‌ద్దు

తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్

ఎంఎంటీఎస్ రైళ్ల స‌ర్వీసు ర‌ద్దు
– నేడు 34 రైళ్ల నిలిపివేత‌
హైదరాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : నేడు హైద‌రాబాద్‌లో ప‌లు ఎంఎంటీఎస్ రైళ్ల ర‌వాణా స‌ర్వీసుల‌ను ర‌ద్దుచేసింది. ఇటీవ‌ల కాలంలో సెలవులు రోజులు, ప్రత్యేకంగా ఆదివారం వచ్చిందంటే చాలు.. దక్షిణ మధ్య రైల్వే భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తోంది. వివిధ ఆప‌రేష‌న్ కార‌ణాల‌ను చూపిస్తూ ఎంఎంటీఎస్ రైళ్ల స‌ర్వీసుల‌ను ఆపివేస్తుంది. తాజాగా ఆదివారం కూడా వివిధ మార్గాల్లో నడవాల్సిన 34 ఎంఎంటీఎస్ రైళ్లు స‌ర్వీసుల‌ను నిలిపివేసింది. లింగంపల్లి-హైదరాబాద్‌, హైదరాబాద్‌-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య నడవాల్సిన రైళ్లను రద్దు చేసింది.
రద్దయిన సర్వీసులు ఇవే..
లింగంపల్లి-హైదరాబాద్‌ మధ్య 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140 నంబర్ గల రైళ్లను, హైదరాబాద్‌-లింగంపల్లి మార్గంలో 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 నంబరు గల రైళ్లను రద్దు తెలిపింది.
ఇక ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో ఎనిమిది రైళ్లు రద్దు కాగా.. ఇందులో 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170 నంబర్లు గల రైళ్లను రద్దు చేసింది. లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో 47176, 47189, 47187, 47210, 47190, 47191, 47192 నంబరు గల రైళ్లు రద్దయ్యాయి. వీటితోపాటు సికింద్రాబాద్‌-లింగంపల్లి (47150), లింగంపల్లి-సికింద్రాబాద్‌ (47195) కూడా క్యాన్సల్‌ అయ్యాయి.