మహిళల సంక్షేమానికి టీఆర్ఎస్ పెద్దపీట
– అన్ని వర్గాల పండగలకు సమాన ప్రాధాన్యం
– ఆడబిడ్డలకు సర్కారు కానుక బతుకమ్మ చీర
– ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వం మహిళలకు ఆనవాయితీగా అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు హాజరై మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఒంటరి మహిళలకు ఆసరా, పేదింటి యువతులకు కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్, గర్భిణీలకు, బాలితంలకు అమ్మఒడి, కేసీఆర్ కిట్, పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అన్ని వర్గాల వారి పండగలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తోందని, రంజాన్ పండగకు రంజాన్ తోఫా, దసరాకు బతుకమ్మ చీరల పంపిణీ నిర్వహిస్తుందని గుర్తుచేశారు. బతుకమ్మ, దసరా పండగలను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నామాల నర్సింలు, ఫ్లోర్ లీడర్లు శోభారాణి, సోమ శేఖర్, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, సంగీత ఠాకూర్, రాము, వెంకన్నగౌడ్, టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


