దుర్గామాత సేవలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
– అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
– అన్నదానం చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: శరన్నవరాత్రుల్లో భాగంగా తాండూరు పట్టణం బసవణ్ణ కట్ట ప్రతిష్టించిన దుర్గామాత సేవలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు తరించారు. మంగళవారం బసవణ్ణ కట్ట వద్ద ప్రతిష్టించిన అమ్మవారిని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు వేరు వేరుగా వెళ్లి దర్శించుకున్నారు. మండపంలో కొలువుదీరిన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రారంభించి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, మంకాల రాఘవేందర్, సంగీత ఠాకూర్, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవిందర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, సాయిపూర్ బాల్ రెడ్డి, జి.రవీందర్, యువనాయకులు బిర్కడ్ రఘు, అశోక్ తదితరులు ఉన్నారు.


