వైద్య సిబ్బంది కూడ దేవుళ్లతో సమానం
– వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్
– జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బందికి చీరల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్య సిబ్బంది పోషించే పాత్ర దేవుళ్లతో సమానమైందని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. గురువారం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు బతుకమ్మ చీరల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ హాజరై బతుకమ్మ చీరలను పంపీణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఆసుపత్రిలో రోగుల పట్ల వైద్య సిబ్బంది నిబద్దత వెల కట్టలేనిదన్నారు. మరింత మెరుగైన సేవలను అందించి ఆసుపత్రి ప్రతిష్టను పెంచాలని ఆకాంక్షించారు. అదేవిధంగా అందరితో పాటు తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ సంబరాలను సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ(సయూం), హెచీసీ సభ్యులు డా.రమణబాబు, ఆర్ఎంఓ డా. ఆనంద్ గోపాల్‌రెడ్డి, సాయిలు గౌడ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


