నాపరాతి ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
– తాండూరు మండలం కోటబాస్పల్లిలో ఘటన
– కేసు నమోదు చేసుకున్న కరణ్ కోట్ పోలీసులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : నాపరాతి లోడ్ తో వెళుతున్న ట్రాక్టర్ రోడ్డు దాటుతున్న యువకున్ని ఢీకొట్టడంతో దుర్మరణం చెందాడు. ఈ సంఘటన తాండూరు మండలం కరణ్ కోట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసులు, కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామానికి చెందిన వడ్డె రాజు, వడ్డె గంగమ్మల మూడో కుమారుడు వడ్డె చిన్న యాదగిరి(17) కుటుంబంతో పాటు నాపరాతి గనుల్లో కూలీ పనులు చేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం గ్రామంలోని ఆంజేయ స్వామి దేవాలయం వద్ద రోడ్డు దాటుతుండగా నాపరాతి లోడుతో వస్తున్న ట్రాక్టర్ యాదగిరిని ఢీ కొట్టడంతో దాని కింద పడిపోయాడు.

తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు యాదగిరి మృతి చెందినట్లు తెలిపారు. దీంతో తమ కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులతో పాటు కుటుంభీకులు బోరున విలపించారు. కుటుంభ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు కరణ్ కోట్ పోలీసులు తెలిపారు.

ఇదికూడా చదవండి…

