రండి.. రక్తదానం చేయండి..!
– రేపు తాండూరులో రక్తదాన శిబిరం
– లయన్స్ క్లబ్, మార్వాడి యువమంచ్, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రాణాపాయంలో ఉన్న బాధితులను ఆదుకునేందుకు రక్తదానం చేసేందుకు అందరు ముందుకు రావాలని తాండూరు లయన్స్ క్లబ్, ఆల్ ఇండియా మార్వాడి యువమంచ్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పిలుపునిచ్చారు. ప్రతి యేడాది మాదిరిగానే అక్టోబర్ 2వ తేదిన తాండూరులో రక్తదాన శిబిరాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జాతిపిత మహాత్మ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీల జయంతిని పురస్కరించుకుని ఆదివారం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆయా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కొనసాగుతుందని చెప్పారు. 18 ఏండ్లు నుంచి 65 ఏండ్లు వయస్సు ఉన్న వారు 45 కిలోల బరువు ఉన్నవారు రక్తదాని చేయొచ్చని, హిమోగ్లోబిన్ అధిక శాతం ఉన్న వారు రక్తదానం చేయొచ్చని శిబిరం చైర్మన్లు మన్మోహన్ సార్డా, రమాకాంత్ పండిత్, కోట్రిక శ్రీకాంత్‌లు ఓ ప్రకటనలో తెలిపారు. కావున తాండూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు.

