రెండేళ్లు ఆదర్శ ప్రగతి
– మార్కెట్ కమిటికి అభివృద్ధి పుంతలు
– త్వరలోనే కొత్త యార్డు నిర్మాణానికి శంకుస్థాపన
– రూ. 25 కోట్లతో 30 ఎకరాలలో నిర్మాణం
– తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్
తాండూరు, దర్శిని ప్రతినిధి: రెండేళ్ల పాలనలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటిలో ఆదర్శంగా నిలిచే అభివృద్ధికి చేయడం జరిగిందని కమిటి చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. బుధవారం తాండూరు మార్కెట్ కమిటి కార్యాలయంలో చైర్మన్ విఠల్ నాయక్ అధ్యక్షతన పాలక వర్గ సాధారణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ రెండెళ్ల పాలనలో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహకారంతో మార్కెట్ కమిటి అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. పట్టణంలోని మార్కెట్ కమిటిలో రూ. 1కోటితో షెడ్ల నిర్మాణం, రూ. 10 లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటు, రైతులకు విశ్రాంతి గది, రైతులకు మరుగుదొడ్లు నిర్మాణం చేయించడం జరిగిందని వెల్లడించారు. అదేవిధంగా గత 30 ఏండ్లుగా జరగలేని మార్కెట్ కమిటి అభివృద్ధి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహకారంతో సుసాధ్యం చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా యాలాల బషీర్ మియా తాండ సమీపంలో 30 ఎకరాలలో కొత్త మార్కెట్ యార్డుకు జీవో తీసుకురావడం జరిగిందని గుర్తుచేశారు. రూ. 25 కోట్లతో నిర్మించే కోత్త యార్డును మునుగోడు ఉప ఎన్నికల తరువాత శంకుస్థాపన చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు మార్కెట్ కమిటి చైర్మన్గా రెండు సంవత్సరాలు అవకాశం కల్పించడం పట్ల ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పాలక వర్గం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పైలట్ రోహిత్ రెడ్డి అడుగుజాడల్లో నడిచి వారి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకట రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పద్మమ్మ, మల్లప్ప, సప్తగిరి గౌడ్, భీమ్ రెడ్డి, మొహమ్మద్ ఇర్ఫాన్, కట్కం వీరేందర్, దినేష్ ఠాగూర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజేశ్వరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

