చేపల వ్యాపారికి క్రేజీ డే
– ఒక్కరోజులో మారిన తలరాత
– అప్పుకోసం బ్యాంకు నోటీసులు
– అంతలోనే రూ. 70 లక్షల ల్యాటరీ
దర్శిని డెస్క్ : ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకరోజు మరుపు సంఘటనలు జరుగుతాయి. అవి వారి జీవితాలను గొప్ప మలుపు తిప్పొచ్చు.. లేదా ఆఘాతంలో పడేయొచ్చు. ఇలా రోజూ ఊరూరు తిరిగి బైకుపై చేపలు అమ్ముకునే వ్యాపారి జీవితంలో క్రేజీ డే చోటు చేసుకుంది. ఒకే రోజు బ్యాంకు నుంచి తీసుకున్న లోన్ చెల్లించాలని అధికారులు నోటీసులు అందిస్తే.. గంటన్నరలోపే అతనికి రూ. 70 లక్షల ల్యాటరీ వరించింది. నమ్మశక్యంగా లేని సంఘటనలు అతని జీవితంలో మరుపురాని రోజును విధి అందించింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళ కొల్లాంలోని మైనాగపల్లి ఎడవనాస్సేరిలో నివాసముంటున్న పూకుంజు(40) తన కుటుంబ పోషణ కోసం మోటార్‌సైకిల్‌పై చేపలు అమ్ముతుండేవాడు. ఇల్లు కట్టుకునేందుకు కార్పొరేషన్ బ్యాంకులో ఎనిమిదేళ్ల క్రితం రూ.7.45 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పటి నుంచి తిరిగి చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పుడు ఆ బాకీ వడ్డీతో సహా దాదాపు రూ.12 లక్షలకు చేరింది. దీంతో బ్యాంకు నుంచి అటాచ్మెంట్ నోటీసు రావడంతో తన ఇల్లు పోతుందేమోనని ఆందోళన చెందాడు. అయితే తండ్రి నుంచి లాటరీ కొనే అలవాటు అబ్బిన పూకుంజు అదే లాటరీ తన అదృష్టాన్ని నిలెబెట్టింది. చిన్నప్పటి నుంచి అలా లాటరీలు తీస్తూనే ఉన్నా.. అయితే ఇప్పటివరకు రూ. 2,000-రూ. 10,000 మధ్య మాత్రమే గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం ప్లామూట్టిల్ మార్కెట్లో లాటరీ విక్రయదారుడు గోపాల పిళ్లై నుంచి లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. గురువారం బ్యాంక్ నోటిసు వచ్చిన గంటర్నర తర్వాత.. ఆ లాటరీ టికెట్‌కు గంటన్నర తర్వాత లాటరీలో 70 లక్షలు గెలుచుకున్నట్లు తెలిసింది. దీంతో అతను ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఈ డబ్బుతో బ్యాంకు లోను తీరుస్తానని, కుటుంబ పోషణకు కొంత డబ్బు.. కూతురు ముహ్సీనా 10వ తరగతి, ప్లస్‌టూ చదువు తున్న కుమాడరు మునీర్‌ల చదువులకు మిగిలిన డబ్బు వినియోగిస్తానని తెలిపాడు.

