హైకోర్టు అసిస్టెంట్ ప్లీడర్‌గా తాండూరు వాసి

కెరీర్ తాండూరు తెలంగాణ వికారాబాద్

హైకోర్టు అసిస్టెంట్ ప్లీడర్‌గా తాండూరు వాసి
– నేడు బాధ్యతలు తీసుకోబోతున్న ప్రవీణ్‌ గౌడ్
– అభినందనలు తెలిపిన ప్రజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా తాండూరు వాసి నియామకం అయ్యారు. నేడు హైకోర్టులో బాధ్యతలు స్వీకరించనున్నారు. తాండూరు పట్టణానికి చెందిన ఎస్.వెంకట్రాములు గౌడ్‌ కు ముగ్గురు కుమారులు. ఇందులో రెండో కుమారుడు అయిన ఎస్.ప్రవీణ్ గౌడ్ విద్యాభ్యాసం డిగ్రీ వరకు తాండూరులో కొనసాగింది. ఆ తరువాత న్యాయవాదిగా హైదరాబాద్‌లో కొనసాగుతున్నారు. గత వారం రోజుల క్రితం ఎస్.ప్రవీణ్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌గా నియామకం అయ్యారు. ప్రవీణ్ గౌడ్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా నియామకం కావడం పట్ల కుటుంబ సభ్యులతో పాటు తాండూరు ప్రజలు అభినందనలు తెలిపారు. హైకోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌ కావడం గర్వకారణమని హర్షిస్తున్నారు. ప్రవీణ్ గౌడ్ అన్న ఎస్. శ్రీధర్‌ గౌడ్ తాండూరులో ప్రముఖ అనస్తిషీయా వైద్యులుగా కొనసాగుతున్నారు. ఆయన తమ్ముడు వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. బుధవారం హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా ప్రవీణ్ గౌడ్ బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.