కారు ఎమ్మెల్యేలకు కరెన్సీ ఎర
– పార్టీ పిరాయింపులకు డీల్
– పోలీసులకు సమాచారం అందించిన ఎమ్మెల్యేలు
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఢిల్లీకి చెందిన నలుగురు ఎరవేశారు. ఇందుకోసం నగర శివారులో రహస్య మంతనాలు జరిపిన ఈ సంఘటన తెలంగాణలో కలకలం రేపింది. ఈ సంఘటన తెలంగాణలో కలకలం రేపింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో.. తెరాసకు చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వీరు రంగంలోకి దిగారనే పక్కా సమాచారం అందడంతో పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావులు ఉన్నారు. రెండ్రోజులుగా ఈ నలుగురూ.. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పక్కా సమాచారంతో తెలంగాణ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు.
తెరాస ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చారు: సీపీ
ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారనే సమాచారం వచ్చిందని, ప్రలోభాల ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. తెరాస ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టామని వెల్లడించారు. ‘‘డబ్బు, కాంట్రాక్టులతో ప్రలోభపెడుతున్నారని చెప్పారు. ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామంద్ర భారతి. తిరుపతికి చెందిన సింహయాజీ అనే స్వామీజీ హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌తో కలిసి వచ్చారు’’ అని సీపీ వెల్లడించారు.

