గుజరాజ్‌లో ఘోరం..!
– కుప్పకూలిన మచ్చు కేబుల్ బ్రిడ్జి
– నదిలో పడిపోయిన 400ల మంది..?
– 7 మంది దుర్మరణం
దర్శిని ప్రతినిధి: గుజరాత్లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీ ప్రాంతంలోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కుప్పకూలి పోయింది. ఈ ఘటనలో బ్రిడ్జి మీదుగా వెళుతున్న సందర్శకులు నదిలో పడిపోయారు. ఏడుగురు చనిపోయినట్లు తెలుస్తున్నది. నదిలో పడిపోయిన వారు 400 మందికి పైగా ఉండొచ్చునని పోలీసులు చెబుతున్నారు. పలువురు గాయ పడినట్లు తెలుస్తోంది. సమాచారం తెలిపిన వెంటనే పౌర, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇదిలా ఉండే ఇటీవలే దెబ్బ తిన్న ఈ కేబుల్ బ్రిడ్జికి రిపేర్లు చేసిన తర్వాత ఐదు రోజుల క్రితం సందర్శకుల రాకపోకలకు అనుమతించారని సమాచారం. గాయపడిన వారిని చికిత్స కోసం తరలించేందుకు భారీగా అంబులెన్స్‌లను మోహరించారు. స్థానికుల సాయంతో గల్లంతైన ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Gujarat | A cable bridge collapsed in the Machchhu river, Morbi area today. Several people fear injured. Further details awaited. pic.twitter.com/OZrDTxCWqx
— ANI (@ANI) October 30, 2022
मोरबी गुजरात में बड़ा हादसा। पुल टूटने से कई लोग पानी में गिरे।#GUJARAT #morbi #bridge pic.twitter.com/JP0r6GZ09N
— अजीत तिवारी (@ajittiwari24) October 30, 2022

