హెల్మెట్, సీట్ బెల్ట్ ధరిస్తేనే రక్షణ

ఆరోగ్యం క్రైం తాండూరు వికారాబాద్

హెల్మెట్, సీట్ బెల్ట్ ధరిస్తేనే రక్షణ
– అందరు రోడ్డు నిబంధనలు పాటించాలి
– తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: వాహన దారులు హెల్మెట్, సీటు బెల్టులు ధరించడం వల్ల ప్రమాదాల నుంచి రక్షణ పొందుతారని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్ద రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి సమక్షంలో విద్యార్థులు బైకులు.. కార్లను ఆపి హెల్మెట్ పెట్టుకోవాలని, సీటు బెల్టు ధరించాలని వాహన దారులకు సూచించారు. హెల్మెట్ లేని వారికి గులాబీ పువ్వు ఇచ్చి.. హెల్మెట్ కూడ అందజేశారు. నినాదాలు, ప్లకార్డులతో రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పిస్తూ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్క వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. బైకులు నడిపేవారు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపే వారు సీటు బెల్టులు ధరించాలని సూచించారు. వాటిని ధరించడం వల్ల ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చన్నారు. అదేవిధంగా మైనర్లకు బైకులు ఇవ్వరాదని, మద్యం సేవించి వాహనాలను నడపరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్, పోలీసు సిబ్బంది, చైతన్య స్కూల్ యజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు.