వాస్‌దేవ్ స్వామి పాదపూజలో తరించిన భక్తులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కర్ణాటక రాష్ట్రం జేవర్గి తాలూకా ఆందోల్‌లోని గురు భోజలింగ స్వామి మఠం పీఠాధిపతి వాసుదేవ్ స్వామి సేవలో తాండూరు భక్తులు తరించారు. ఆదివారం తాండూరు మండలం బెల్కటూర్‌తో పాటు తాండూరు పట్టణాన్ని సందర్శించారు. బెల్కటూర్ గ్రామస్తులు, పట్టణం లోని పలువురు శిష్యులు ఆయనను ఇంటికి ఆహ్వానించి కుటుంబ సభ్యులతో పాదపూజ కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. అదేవిధంగా పీఠాధిపతి వాసుదేవ్ స్వామిని తాండూరు భూకైలాస్ వ్యవస్థాపకులు వాసుపవార్ నాయక్, మున్సిపల్ మాజీ చైర్మన్ గా నర్సింహులు, మాజీ డీపీసీ సభ్యులు, ప్రముఖ వైద్యులు వెంకటసుబ్బయ్య, ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖరెడ్డి తదితరులు ఆహ్వానించి పాదపూజలో తరించారు.
