కార్మికుల సమ్మెకు బ్రేక్..!

తెలంగాణ రాజకీయం వికారాబాద్

కార్మికుల సమ్మెకు బ్రేక్..!
– వైస్ చైర్‌ పర్సన్ హామితో విరమణ
– ఎమ్మెల్యే సహాకారంతో పరిష్కరిస్తాం
– విరమింప జేసిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: పీఆర్సీనీ అమలు చేయాలడని డిమాండ్ చేస్తూ తాండూరు మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు బ్రేక్ పడింది. గత 18 రోజులుగా కొనసాగిన సమ్మెలో హైడ్రామాలకు కూడ తెరపడింది. మంగళవారం కార్మికుల సమ్మె శిబిరానికి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, కౌన్సిలర్లతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా వారు కార్మికులతో చర్చించి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో వచ్చే డిసెంబర్ నాటికి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామి ఇచ్చారు. దీంతో కార్మికులు సమ్మె విరమించేందుకు అంగీకరించారు. గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కౌన్సిలర్లు సమ్మెలో బైటాయించిన కార్మికులకు కూల్‌ డ్రింక్ తాగించి సమ్మెను విరమింప జేశారు. అనంతరం చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ కార్మికులకు త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు మాట్లాడుతూ కార్మికుల పీఆర్సీ అంశం ఉన్న ఎజెండాపై కొందరు రాజకీయ స్వార్థం కోసం కోర్టుకు వెళ్లారని, దీంతో కార్మికుల పీఆర్సీతో పాటు పట్టణ అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడ్డాయన్నారు. కాని అదే నాయకులు కార్మికుల విషయంలో అభయహస్తం ఇస్తున్నట్లు సవతి చూపించారని విమర్శించారు. ఆ సవతి ప్రేమను ఎవ్వరు నమ్మరని అన్నారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాలతో కార్మికులను చర్చలు జరపడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే సహాకారంతో డిసెంబర్ నెలాఖరు నాటికి సమస్య పరిష్కారం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తన మాటను గౌరవించి సమ్మెను విరమించిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ సోమశేఖర్, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, విజయదేవి, సంగీత ఠాకూర్, అస్లాం, భీంసింగ్, ముక్తార్ నాజ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, మున్సిపల్ ఏఐటీయూసీ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.